మీటూ ఉద్యమంలో భాగంగా తాము ఎదుర్కొన్న ఇబ్బందులు పబ్లిక్ గా కొంత మంది హీరోయిన్లు బయటపెడుతూ ఉంటే మరికొంత మంది సపోర్ట్ ఇస్తున్నారు. అన్నమయ్య హీరోయిన్ కస్తూరి కూడా మీటూకు మద్ధతూ పలికింది. ఈ విషయం గురించి మాట్లాడుతూ పబ్లిసిటీ కోసం హీరోయిన్లు ఇలా మాట్లాడుతున్నరని ఎన్నో కామెంట్లు వస్తున్నాయి. ఎవరైన ఒక స్త్రీ బయటకు వచ్చి తన అనుభవం చెపితే మొదట్లోనే జడ్జ్ చేసేస్తారు.ఇలా చేసినందువల్ల తనకు వచ్చే లాభం ఏమిటనే దిశగానే మొదట ఆలోచనలు సాగుతున్నాయి. కానీ ఇలా అవమానాలు బయటపెట్టాలంటే ఎంతో ధైర్యం కావాలి. బాగా ఆలోచించండి. వాళ్ళకు వచ్చిపడే లాభం ఏమిటి?ఇంకాస్త అవమానం తప్ప ఎప్పుడో ఏదో జరిగితే ఇప్పుండేందుకు బయటపెట్టం అంటారు. ఒక అవకాశం వచ్చింది కదా. చుట్టు సపోర్టు ఉన్నది కదా అనే ధైర్యం లో ఒక్కొక్కళ్ళు బయటకు వస్తారు. ఇప్పుడు స్త్రీలను ప్రశ్నించటం మానేసి వాళ్ళను వేధించిన వాళ్ళను సమాధనం చెప్పమని అడగండి అంటోంది కస్తూరి.