Categories
ఒక సినిమాలో నా పాత్రకున్న అవకాశం ,నా ఇంపార్టెన్స్ ,చూసుకుంటాను తప్ప ఆ పాత్ర పరిధి ,వినిడి నేనెప్పుడూ దృష్టిలోకి తీసుకోలేదు అంటుంది తమన్న . సినిమాలో కథ నాయకుడు చేయవలసింది మేము చేయలేము. మేము చేసేది వాళ్ళు చేయలేరు. ఎవరి పాత్రలు వాళ్ళవి,ఇందులో తక్కువ ఎక్కువ ప్రస్తావనే లేదు. ఒక కథ మహళ చుట్టు తిరిగితే ఎలా చూసినా అందులో కథ నాయిక ప్రాధాన్యత ఉంటుంది. అలా అని ప్రతి సినిమాలో నాకు ఎంతో పరిధి కావాలని చెప్పలేను. సన్నివేశాల సంఖ్యని బట్టి సినిమాను ఎంపిక చేసుకోలేనే. కానీ ఏ సినిమా సక్సెస్ లోనూ నేనుంటే బావుండుననే కోరికలు నా పాత్రకు న్యాయం జరిగేలా నేను కృషి చేస్తా అంటోంది తమన్న. ఒక సినిమా సక్సెస్ కు హీరో హీరోయిన్ లు ఇద్దరూ సమానమే.