ఎక్కువసేపు ఆలోచిస్తే మెదడు సృజనాత్మకతను కోల్పోతుందనీ ,ఏదైనా కొత్తగా చేయాలనీ ప్రయత్నిస్తూ ఉంటే ఆలా మెదడు అలిసిపోయేదాకా ఆలోచించవద్దు అంటున్నారు పరిశోధకులు . మెదడు ఫ్రెష్ గా ఉండాలి . తుది నిర్ణయంకోసం మెదడుకు పనిపెట్టే ముందర ,అసలా పని గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేయమంటున్నారు . మెదడు చురుగ్గా ఈ అధ్యయనాన్ని వంట పట్టించుకొంటుంది . లేదా మెదడు వెంటనే నిర్ణయం తీసుకోలేక గందరగోళ పడుతుంది పదినిముషాల ఆలోచన అవతల పడేసి కొద్దిసేపు బయట నడవమంటున్నారు . లేదా పచ్చని మొక్కల మధ్య తిరగటం ఒక కప్పు కాఫీ పెట్టుకోవటం వంటి వాటిలో పూర్తిగా మనసుని మళ్లిస్తే మెదడు ఈలోగా రిఫ్రెష్ అవుతుంది . అప్పుడు మళ్ళీ చురుగ్గా ఆలోచిస్తుంది . పునరుత్సహన్ని పొందుతుంది అంటున్నారు అద్యాయనకారులు .

Leave a comment