Categories
ఎంత శ్రద్ధ తీసుకొన్న ఈ శీతాకాలంలో చర్మం పొడి బారి పోతుంది. మేకప్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ద తీసుకొంటేనే ముఖం తాజాగా ఉంటుంది. ఇక ఆఫీస్ కు తయారయ్యే వాళ్ళు ముందుగా ముఖాన్ని మైల్ట్ సోప్ తో కానీ మంచి సున్ని పిండితో గానీ బాగా కడుక్కొని చర్మం తడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ రాసుకోవాలి.చర్మం రంగుకు నప్పే షేడ్ లో ఫౌండేషన్ వేసుకోవాలి. ఆ తర్వాత కొద్ది పాటి మేకప్ వేసుకోవాలి కను రెప్పలపైన పెన్సిల్ లైనింగ్ వేసుకొని ఆపైన కాటుక ఐలైనర్ పెట్టుకోవాలి. ముఖానికి చేసే న్యూట్రిన్ షేడ్స్ వాడుకోవాలి. ఆయిలీగా ఉంటేనే ముఖం మెరుస్తూ ఉంటుంది. ముందుగా పెదవులపై ముదురు వర్ణపు రంగు బేస్ గా వేసుకొని అటు తర్వాత కావలసిన షేడ్ వేస్తే లిప్ స్టిక్ ఎక్కువసేపు తాజాగా ఉంటుంది.