నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నిర్వహించిన తాజా అధ్యయనం మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళే శక్తిమంతులు అంటోంది. కరువులు,అంటువ్యాధులు వస్తే ఆడవాళ్ళే వాటిని సమర్దవంతంగా ఎదుర్కొగలుగుతారట. మహిళల సగటు ఆయురార్ధం 83.1 ఏళ్ళుగా ఉంటే మగవాళ్ళ ఆయురార్థం 79.5గా ఉంది. చరిత్రలో ప్రజలు అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్న ఏడు సందర్భాలను సదరన్ యూనివర్సిటీ ఆఫ్ డెన్మార్క్ ప్రోపెసర్లు అధ్యయనం చేశారు.ఐరిష్ కరువు ,ఐస్ లాంగ్ అంటువ్యాధులు ,బానిసలుగా బతికిన ఆఫ్రికన్లు ఇలా కఠినమైన పరిస్థితుల్లో ఆడ,మగ ఎదదుర్కొన్న తీరును పరిశోధణలోకి తీసుకొని అన్ని సందర్భాలలో ఆడవాళ్ళు ఆయురార్ధమే ఎక్కువని తేలింది. స్త్రీలలో అధికంగా ఉండే ఈస్ట్రోజన్లు ఆరోగ్యంపైన సానుకూలమైన ప్రభావం చూపిస్తుందట. ఏ రకంగా చూసిన ఆడవాళ్ళ శక్తిమంతులని అధ్యయనాలు ప్రకటించాయి.
Categories