ఇక చల్లని వాతావరణం మొదలైతే చర్మంలో పిగ్మెంటేషన్ మొదలవుతుంది. ముఖం తాజాగా మెరిసిపోయోలా ఉండాలంటే పెసరపిండి వాడాలి. పెసరపిండి పెస్ట్ ని ముఖానికి మాస్కులా వేసి ఆరిపోయాక కడిగేస్తే ముఖం పైన మృత కణాలుపోయి చర్మం చక్కగా ఉంటుంది. అలాగే ఈ పిండి పాలు,పసుపు వేసి మాస్క్ వేసుకొన్న ఇదే ఫలితం కనిపిస్తుంది. ముఖంపై మలినాలు పోతాయి .మొహం తేమగా ,తాజాగా ఉంటుంది. అలాగే పెరుగు నిమ్మరసం కలిపి మాస్క్ వేసుకొన్న ఓ అరగంట తర్వాత కడిగేసిన ముఖం చక్కగా తాజాగా ఉంటుంది.

Leave a comment