Categories
కూరలు ,బియ్యం ,పప్పులు ఉడికించిన నీళ్ళతో ముఖం కడిగితే ఎక్కుడ లేని అందం అంటున్నారు ఎక్స్ పర్ట్స్. బంగాళా దుంపలు ఉడికించిన నీళ్ళల్లో కొంచెం ముల్తానీ మట్టి ,పెరుగు,బాధం నూనె కలిపి ముఖానికి రాసి ఆరిపోయాకా కడిగితే ముఖంపై జిడ్డు మృత కణాలు పోతాయి. ఎండలో ముఖం అలిసిపోతే బియ్యం ఉడికించిన గంజిలో కాస్త తేనె కలిపి ముఖానికి మర్ధన చేస్తే చాలు .ఇది స్క్రబ్ లాగా వాడాలంటే ఇందులో కాస్త బియ్యం పిండి కలిపి రాస్తే నలుపు కూడా తగ్గుతుంది. మొహం కాంతిగా ఉంటుంది. క్యాబెజీ ఉడికించిన నీళ్ళలో పసుపు కలిపి ముఖానికి రాసి కడిగితే మొహం మెరిసి పోతుంది.