![మనీషా కొయిరాలా మళ్ళీ వెండితెర పై కనిపించనుంది. నటుడు సంజయ్ దత్ జీవితం ఆధారంగా తీస్తున్న సినిమాలో ఆమె సంజయ్ దత్ తల్లిగా నటించనున్నారు. అలనాటి ప్రముఖ నటి నర్గీస్ హీరో సంజయ్ దత్ తల్లికీ హీరోయిన్ మనీషా కొయిరాలా కు ఇద్దరికీ మధ్య ఒక పోలిక వుంది. ఇద్దరు కాన్సర్ వ్యాధిగ్రస్తులే. 51 ఏళ్ల వయసులో నర్గీస్ కాన్సర్ తో మరణించారు. కాన్సర్ వ్యాధిని జయించిన మనీషా మేకప్ వేసుకుంటున్నారు. బాలీవుడ్ ఓ సెకండ్ ఇన్నింగ్స్ కోసం చూస్తున్న ఆమెకు సరైన పాత్రే లభించింది. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ బయోపిక్ లో నర్గీస్ పాత్ర కోసం మనీషాని ఎంపిక చేసారు. ఈమెను ఎంపిక చేయటానికి ముఖ్యకారణం ఆమె కాన్సర్ బాధను స్వయంగా అనుభవించటం అన్నారు. దర్శకులు రాజ్ కుమార్ హర్యాణీ . ఇందులో సంజయ్ దత్ తండ్రిగా పరేష్ రావెల్. సతీమణి మాన్యత పాత్రలో దియా మీర్జా మాజీ ప్రేయసి గా సోనమ్ కపూర్ నటిస్తున్నారు.](https://vanithavani.com/wp-content/uploads/2017/02/manisha.jpg)
ఏడేళ్ళ పాటు క్యాన్సర్ కు సంబంధించిన చికిత్సను భరించి ఇటీవల సంజయ్ దత్ బయోపిక్ సంజు లో వెండితెరపైన ఎంట్రీ ఇచ్చింది. మనీషా కొయిరాలా. లవ్ స్టోరీస్ వెబ్ సీరిస్ లోనూ నటించింది ఈ మధ్యనే తన క్యాన్సర్ గురించిన అనుభవాలు హీల్డ్ అనే పేరుతో పుస్తకంగా రాశారామే. క్యాన్సర్ అంటే మరణమే అనుకొంటారు ఆ అపోహను పోగోట్టాలనే నేను Healed బుక్ రాశాను. క్యాన్సర్ వ్యాధితో బాధపడటం నా జీవితంలో ఒక భాగం అంతే .హస్పిటల్ లో ఆరు నెలల పాటు చికత్సా తీసుకోన్నారామే.ఆరేళ్ళపాటు ఆ వ్యాధితో పోరాడి జయించారు. రచయిత్ర జాతీయ అవార్డు గ్రహిత నీలమ్ కుమార్ తో కలిసి హీల్డ్ పుస్తకం రాశారు. ఈ పుస్తకాన్ని పెంగ్విన్ సంస్థ ప్రచురించింది. హీ క్యాన్సర్ గేల్ మి న్యూ లైవ్ అన్నాది ట్యాగ్ లైన్..