ఈ ప్రపంచంలో విలువకట్టలేని వస్తువులు కూడా చాలా ఉన్నాయి. 1905లో క్యుల్లినన్న్ అనే అతిపెద్ద వజ్రం దక్షిణాఫ్రికా గనుల్లో దొరికింది. ఇది సమారు 0.6 కేజీల బరువుంది.3106 క్యారెట్ల బరువు గల ఈ వజ్రానికి విలువ ఇప్పటికి నిర్ణయించలేదు. ఈ వజ్రం దొరికిన గని చైర్మన్ పేరు ధామస్ కుల్లినన్ ఆయన పేరే వజ్రానికి పెట్టారు. అలాగే లావ్ జా అనే ముత్యం నాలుగు నెలల చంటి పాపంతా బరువువుంటుంది. అంటే సుమారుగా 6.37 కేజీ . ఇది ఫిలిపిన్ సముద్రంలోని ఒక ముత్యపు చిప్పలో దొరికింది. ఈ ముత్యం విలువ కూడా ఇంకా నిర్ణయించలేకపోయారు.