Categories
మొనోపాజ్ దశలో ఎదురయ్యే చాల సమస్యలు జీవన శైలీ ఆహారం మార్పులతో అదుపులో ఉంచుకోవచ్చు. ముందుగా శరీరానికి పోషకాలు అందాలి ముఖ్యంగా బీ12 చాలా అవసరం.ఆహరంలో చేపలు,మాంసం తీసుకుంటే ఈ పోషకం అందుతుంది.ఈ సమయంలో ఎముకలు బలహీనపడతాయి.ఆహారం ద్వారా కాల్షియం అందేలా చూసుకోవాలి. ఆకుకూర,బెండకాయ,చిక్కుడు,బీన్స్ ,చిలకడ దుంప వంటి కూరగాయలు నారింజ జామ,బొప్పాయి వంటి పండ్లు తినాలి.చేప,చీజ్ గుడ్ల ద్వారా విటమిన్ డి కూడా అందుతుంది. వీలైనంత వరకు నడవాలి. మెట్లు ఎక్కిదిగాలి.వ్యాయామం దినచర్యలో భాగం కావాలి.ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.