Categories
చలికాలంలో పొడి భారీనా చర్మం మొహం అందాన్ని పాడుచేస్తుంది. చర్మానికి తేమగా ఉంచుకోవటం, మృత కణాలు తొలిగించటం ఈ సీజన్ లో చేయవలసిన పనులు, అవిసె నూనె ,నువ్వుల నూనె ,ఆలీవ్ నూనె ఆహారంగా తీసుకోవటం వల్ల చర్మం లోపల నుంచి నిగారింపు వస్తుంది. చర్మం ముడతలు లేకుండా ఉంటుంది. పెరుగు నిమ్మరసం తేనె కలిపి మొహానికి పట్టిస్తే చక్కని నిగారింపు వస్తుంది. మృత కణాలు చర్మాన్ని పొడిబారీనట్లు చేస్తాయి. గుప్పెడు బాదం గంజలు వేడినీళ్ళలో వేస్తే కాసేపటికి పొట్టు ఊడి వస్తుంది ఇప్పుడీ గింజలను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడితో స్క్రబ్ చేస్తే మొహాం తేటగా ఉంటుంది. నిమ్మ చెక్కలు బత్తాయి తొక్కలు కూడా ఎండబెట్టి పొడి చేసుకొని ఆ పొడితో స్క్రబ్ చేసుకొన్న మొహాం నిగారింపుతో చక్కగా ఉంటుంది.