మోడ్రన్ డ్రెస్ లు వేసుకొంటే అమ్మాయిలైన ఏ పెళ్ళికో ,పండగకో సంప్రదాయ వస్త్రధారణకే మొగ్గు చూపిస్తారు. పెద్ద పెద్ద అంచుల ,టిష్యూ నేతతో ,గళ్ళ వంటి కొత్త డిజైన్లు ,పరికిణీల్లా కుచ్చించుకొనేందుకు బావుంటాయి. కంచి పట్టు లో అయితే పౌడర్ బ్లూ ,ముదురు నీలం ,సీగ్రీన్ ,బాటిల్ గ్రీన్ వంటివి ఎంచుకొని ,వీటికి అంచున్న ఓణీలను జత చేస్తే బావుంటుంది. పట్టు కాకపోతే గద్వాల్ ,పోచంపల్లి ,మంగళగిరి వంటి రకాలు కూడా అందంగా ఉంటాయి. బ్లౌజ్ ఆధునికంగా ఉండాలి. నిజానికి పరికిణీ ఫ్యాషన్ మాత్రం ఎప్పటికి పాతబడదు.పట్టు పరికిణీల్లో అచ్చమైన తెలుగింటి సంప్రదాయం కనబడుతోంది.

Leave a comment