సాధారణంగా పిల్లలు ఉదయం పూట పాలు సాయంత్రం పూట  స్కూలు నుంచి రాగానే పండ్ల రసాలు ఇస్తుంటారు తల్లులు . పండ్ల రసం ఆరోగ్యవంతమైన ఆహారంగా భావిస్తుంటారు. విటమిన్ సి కాల్షియం కు పండ్ల రసాలు మంచి ఆధారమే అయినా ఇందులో చాలా లోపాలున్నాయి. నాలుగు పండ్లు రసం తీస్తే కానీ గ్లాసుడు రసం కాదు. కానీ ఇందులో గుర్తించదగిన ప్రోటీన్లు ఫ్యాట్ పీచు విటమిన్లు వుండవు. ఇవన్నీ ఎదిగే పిల్లలలకు పండ్ల ద్వారా లభించే పోషకాలు. కానీ పండ్ల రసాలు కార్బోహైడ్రేట్స్ చక్కెరలుంటాయి. కనుక పిల్లల్లకు వీలైనన్ని పండ్లను యధాతధంగా ఇవ్వటమే మంచిది. పైగా రుచి కోసం పండ్ల రసం లో కలిపే చక్కెర కూడా అనారోగ్యమే. పిల్లలు ఇష్టంగా తాగే ప్యాకెట్లలో ఉండే పండ్ల రసాలు ఎక్కువ ఉప్పు చక్కెర రసం పాడవకుండా నిల్వ చేయటం కోసం కలిపే రసాయనాలు ఉంటాయి . ఈ రకం పండ్ల  రసాలు వల్ల  మేలు కంటే కీడే ఎక్కువ. సురక్షితమైన మార్గం వలచిన బత్తాయి దానిమ్మ ఆలా ఇవ్వటమే.

Leave a comment