పిల్లల దుస్తుల ఏమ్పికలో ఎలాగో శ్రద్ధ చూపిస్తాం. అలాగే వాళ్ళు వేసుకునే చెప్పులు, బూట్ల విషయంలో ఫ్యాషన్ కి ప్రాధాన్యత ఇస్తున్నారా, సౌకర్యానికా? అన్నది కాస్త ద్రుష్టి పెట్టాలి. ఎదిగే చిన్ని పాదాలకు పాదరక్షలు మాటిమాటికీ మార్చాల్సి వస్తుంది. పాదంలో 26 ఎముకలు కలిసి పని చేస్తూ జీవితంతం కదలికలకు, నడకకు ఆరోగ్యానికి పరిరక్షణ ఇస్తూ ఉంటాయి. సరిగా ఫిట్ కాని పాదరక్షలు స్వల్పకాలక, దీర్ఘకాలిక ఇబ్బందులను కలిగిస్తాయి. ఎటువంటి పాదరక్షలు అని డైలమాలో పడితే ముందుగా పాదం ఎలా ఎదుగుతుందనే విషయం పైన ఆలోచించాలి. పిల్లల పాదం పుట్టిన దగ్గర నుంచి 18 ఏళ్ల దాకా పెరుగుతుందిట. ఐదేళ్ళలోపు పిల్లల్ని బట్టి పాదాలతో నడవమనే వైద్యులు సిఫార్స్ చేస్తారు. నెల పై గల నెస్ససరీ ఫీడ్ బ్యాక్ కండరాళ్ళతోనే మెరుగుదలకు సహకరిస్తుంది. ఇది పాదాల్లోనే కాకుండా కాలు, స్పెయిన్ కండరాళ్ళకు సైతం ఉపకరిస్తుంది. ఏడాది వరకు పాదాలకు వత్తిడి రానీయకూడదు. వెచ్చదనం ఇచ్చే బూట్లు, సాక్సులు వాడితే చాలు ఆరోగ్యానికి మెటీరియల్ వాడితే పాపాయి చర్మానికి ఎలాంటి ఇరిటేషన్ లేకుండా సౌకర్యంగా వుంటుంది.

Leave a comment