నా దృష్టిలో వయస్సు ఒక సంఖ్య మాత్రమే అంటుంది 69 ఏళ్ల గృహిణి రజినీ చాంది. దక్షణ భారతదేశంలో సాంప్రదాయ కేరళ లో పుట్టి పెరిగిన రజినీ చాంది తో ఫోటో షూట్ చేశారు. 29 సంవత్సరాల ఫోటోగ్రాఫర్ అతి రాజాయ్ ఆ ఫోటోల్ని తన సోషల్ మీడియా పేజీల్లో అప్ లోడ్ చేశారు. మోడ్రన్ డ్రెస్ లతో బోల్డ్ గా కనిపిస్తున్న రజినీ చాందీ తన డ్రెస్సింగ్ తో సోషల్ మీడియా ప్రశంశలు పొందారు. వృద్ధుల జీవితాల్లో ఎప్పుడు నిరాశ గా   ఉండవలసిన పనిలేదు. జీవితం చివరి వరకు ఏదైనా ఉత్సాహం తో జీవ కాంక్ష తో ఉండవచ్చు ననే ఉద్దేశం తో ఈ విషయం ప్రసారం చేయటం కోసం నేనీ ఫొటోషూట్ చేశాను అంటుంది అతి రాజాయ్. ఈ ఫోటో షూట్ తర్వాత రజిని చంది కి  సినిమా అవకాశాలు వచ్చిపడ్డాయి.

Leave a comment