చిన్ని పాపాయికి నీళ్ళు పోయటం ఇవ్వాళ్టి తరం అమ్మాయిలకు కష్టమే. పెద్దవాళ్ళు కాళ్ళపైన పడుకోబెట్టుకొని పిల్లలకు స్నానం చేయించినట్లు అస్సలు చేతకాదు. వాళ్ళకోసం ప్రత్యేకంగా వచ్చాయి బ్లూమింగ్ బాత్ లోటస్ లు .పాపాయిని మెత్తగా ఇందులో పడుకొబెట్టి స్నానం చేయించ వచ్చు .లోటస్ ఫ్లవర్ ఆకారంలో మెత్తని పరుపు లాంటి ఈ బ్లూమ్ బాత్ పాడ్ లు పాపాయికి సౌకర్యంగా పడుకొనేందుకు వీలుగా ఉంటాయి. నీళ్ళు పోశాకా ఈ పరుపుల్నీ పిండి ఆరేయవచ్చు . తోందరగా తేలికగా చిన్న పాప స్నానం చేసేందుకు ఈ మెత్తని పరుపు బావున్నాయి.

Leave a comment