Categories
ఎత్తు చెప్పులు ఫ్యాషనే కానీ వాటితో చాల సమస్యలు వస్తాయంటారు ఎక్స్ పర్ట్స్.ఎక్కువసేపు నిలబడి ఉండాలన్న నడవాలన్న చెప్పులు ఎత్తు రెండంగుళాలు దాటకుండా ఉండాలి. పాదం పరిమాణం మారుతూ ఉంటుంది.బిగుతుగా ఉండే ఎత్తు చెప్పులు తీసుకోవద్దు. ఒక వెళ ఎత్తు చెప్పులతో రోజంతా నడవాల్సి వస్తే మధ్య మధ్యలో వాటిని వదిలేసి పాదాలను గుండ్రంగా తిప్పటం ముందుకు వంచటం వంటివి చేయాలి. ఎత్తు చెప్పుల భారం మడమలపై పడుతోంది. ఎత్తు పెరిగే కొద్దీ భారం మడమలపై ఎక్కువగా అవుతూ ఉంటుంది. కనుక చెప్పుల్ని సందర్భాన్ని బట్టి ఎంచుకోవాలి. గర్భిణులు, 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు వీటిని ధరించక పోవటమే మంచిది.