Categories
ఎన్ని రకాల దుస్తులున్న అమ్మాయిలకు ఇవ్వాళేం వేసుకొవాలి అన్న సందేహమే. ఏ వయసు వారైన వార్ట్ రొబ్ లో రెండు చక్కని చేనేత చీరెలు, తాజా ట్రెండ్ లో ఒకటైన కలంకారీ ,మరోకటి బెనారస్ తప్పని సరిగా ఉండాలి.ఏ సీజన్ లో కట్టుకొన్న ఈ రకం కాటన్ చీరెలు ఎప్పుడు ఫ్యాషనే . ఇక లెహాంగా అయినా చీరెకైన చక్కని మ్యాచింగ్ కావాలంటే బ్లౌజ్ ల్లో ఫ్లెయిన్ గోల్డ్ ఎరుపు నలుపు ఆకుపచ్చ రంగుల్లో క్రాప్ టాప్ తరహాలో రెండు , ఇకో రెండు మామూలు బ్లౌజ్‌లు ఉంటే వీటిని కాంట్రాస్ట్ గా వేటిపైన అయినా ఎంచుకోవచ్చు. రంగుల విషయానికి వస్తే పగటి పూట లేత రంగు లైటింగ్ ఉన్నప్పుడు ముదరు రంగులు బావుంటాయి.