” శుక్రవారపు పొద్దు సిరిని విడువద్దు
తోబుట్టువుల మనసు కష్ట పెట్టొద్దు.
తొలి సంధ్య మలి సంధ్య నిదుర పోవద్దు……”
శుక్రవారం వచ్చిందంటే సువాసినులకు
మరి తీరిక వుండని మాట పరమ సత్యం.
తెల్లవారు ఝాము నుండి గడపలు కడిగి,పసుపు రాసి కుంకుమ పెట్టి అందంగా వాకిలి కళ్ళాపి చల్లి రంగవల్లితో అందంగా తీర్చిదిద్దుతారు.అమ్మవారి నామాలు స్మరిస్తూ పూజకి పువ్వులు కోయటం పుణ్యం-పురుషార్ధం.ఆ రోజు ఇంటికి వచ్చిన అతిధికి భోజనం పెట్టిన వారి ఆశీస్సులతో మనకు మంచి జరుగుతుంది.అమ్మవారికి మనం చక్కగా జరీ అంచు చీర కట్టుకొని,తలలో పువ్వులు ముడుచుకుని,చేతులకు నిండుగా గాజులేసుకుని,కాళ్ళకి పసుపు రాసుకుని పూజించిలి.
ఇష్టమైన రంగు:పసుపు
ఇష్టమైన పూలు: ఎర్రుపు,తెలుపు,పసుపు పచ్చని గన్నేరు పూలు,జాజి,మల్లె,అన్ని రంగుల చామంతులతో పూజలు స్వికరించటం ఎంతో వినోదం.
ఇష్టమైన పూజ:లలిత సహస్ర నామము పఠించటం.
నిత్య ప్రసాదం: కొబ్బరి అన్నం,నారికేళం(అరటిపళ్ళు),
కొబ్బరి అన్నం తయారీ: కొబ్బరి తురుము చేసి పక్కన పెట్టుకోవాలి.అన్నం ఉడికించి దానిలో కొబ్బరి తురుము కలపాలి.తగినంత ఉప్పు,పచ్చి మిరపకాయలు, కర్వే పాకు వేసి
నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర,శనగ పప్పు,మినప్పప్పు,ఎండుమిరపకాయల్ని పోపు వేసి,వేయించిన జీడిపప్పుతో సౌభాగ్య లక్ష్మి కి ప్రసాదం నైవేద్యం తయారైంది మరి రండి….
“నిండుగ కరముల బంగరు గాజులు..
ముద్దులొలుకు పాదమ్ముల మువ్వలు..
గల గల గలమని సవ్వడి చేయగ
సౌభాగ్యవతులు పూజలు నొందగ
సౌభాగ్యలక్ష్మి రావమ్మ…..అమ్మా…..”!!
-తోలేటి వెంకట శిరీష