పిల్లలు పెద్దలు అన్న తేడా లేదు. అందరు సెల్ ఫోన్స్ కు అతుక్కుపోయి కనిపిస్తారు. చదువుకునే పిల్లలు కూడా ఇలా సెల్  ఫోన్స్ తో బిజీగా వుండటం వల్ల  ఎంతో సమయం వృధా అవుతోందని వాళ్ళు ఎంతో యాంగ్జైటీ లో ఉండటం వల్ల  సగటు పాయింట్ గ్రేడ్స్ తగ్గిపోయున్నాయని కెంట్ స్టేట్ విశ్వవిద్యాలయ అధ్యయనాల్లో గుర్తించారు . పిలల్లు సెల్ ఫోన్స్ వాడిన  స్థాయిలు వాళ్ళు పరీక్షల్లో తెచ్చుకునే గ్రేడ్స్  మ్యాచ్ చేసి చూసారు . గ్రేడ్స్  సరిగా లేవు . వత్తిడీ  అధికంగా కనిపించింది. ఫోన్ ద్వారా నిరంతరం నెట్ వర్క్ కు కనెక్టయి ఉండటం ఆబ్లిగేషన్ అనుకోవటమే ఇందుకు కారణమని అధ్యయనాలు చెప్పాయి. ఈ ఆబ్లిగేషన్ ఇంట్లో కాలేజీలోజిమ్ లో షాపింగ్ మాల్ లో ఎక్కడున్నా వెంటాడుతూ ఉంటుంది. ఇదే యువత పై వత్తిడి తెస్తోంది. అలాగే పని లో వుండే పెద్దలకు ఇదే ఆబ్లిగేషన్. వాళ్ళకీ కాస్తంత రిలాక్స్ గా వుండే అవకాశం లేదు. మానసిక ఆరోగ్యం బావుండాలంటే ఈ సెల్ ఫోన్స్ కు కాస్త దూరంగా ఉండమని అధ్యయనాలు చెపుతున్నాయి

.

Leave a comment