Categories
ఆకుకూరల్ని చిన్నగా చిట్టిమొక్కలుగా ఉన్నపుడే తింటే మంచిదంటున్నారు పరిశోధికులు. గోధుమ,బార్లీ కొత్తి మిర,జీలకర్ర మెంతులు,చుక్క కూర ,తోటకూర అయినా సరే గింజలు చల్లకా రెండు మూడు వారాల్లో చిన్న మొలకలుగా ఉన్నపుడే వాటిలో పీచు ఇతరాత్ర పోషకాలు పెరిగిన మొక్కల్లో కంటే ఎక్కువ అంటున్నారు. ఇళ్ళలోనే చిన్న కుండీల్లో విత్తనాలు చల్లి పది పదిహేను రోజుల్లో బుల్లి ఆకులతో వుండగానే కోసి అన్ని రకాల వంటల్లో వాడుకొంటున్నారు. మొలకలు కన్నా కాస్త పెద్దగా పెద్దవిగా ఆకులకంటే చిన్నగా వుండే ఈ వారం పది రోజుల్లో పెరిగే మైక్రో గ్రైన్స్ లో రేటింపు పోషకాలు ఉంటాయి.