సాహసికురాలు ప్రియ ఎంచుకొంది ఇంకో గొప్ప సాహసోపేతమైన ఉద్యోగం . హిమాలయాల పైన ,ఇంకా పర్వతారోహణలు ఎక్కడైనా ప్రమాదంలో ఇరుక్కుంటే హెలికాఫ్టర్ పైన వచ్చి వాళ్ళను రక్షిస్తుంది ప్రియ అధికారి ,ఇప్పటి వరకు కొన్ని వందల మందిని కాపాడింది రెస్క్యు ప్రియ అధికారి . అందరూ హిమాలయాలు ఎక్కితే నేను లాండ్ అవుతాను అని చెప్పే ప్రియ అధికారి కాంచన గంగ పర్వతం 620 మీటర్లు ఎత్తున ఉన్న పర్వతా రోహణుల కాంప్ కు వెళ్ళి అనారోగ్యం తో ఉన్నా వాళ్ళను రక్షించగలిగింది .కొచిన్ క్రులో ఎడారి శిక్షణ తర్వాత ఉద్యోగం లోచేరి ఎయిర్ హోస్టస్ గా అయిదేళ్ళ పాటు ఎన్నో దేశాలు తిరిగింది . తరువాత పర్వతా రోహణుల్ని రక్షించి ఉద్యోగంలో చేరి హెలికాఫ్టర్ చేతిలోకి తీసుకొంది ప్రియ.