“యా దేవీ సర్వ భూతేషూ శక్తి రూపేణ సంస్ధితాః
నమస్తసై నమస్తసై నమస్తసై నమో నమః”
మెదక్ లో ఉన్న ఏడుపాయల వన దుర్గమ్మను దర్శనం చేసుకుని వద్దాం పదండి!!
జనమేజయుడు సర్పయాగం చేసి ఆ ప్రదేశాన్ని శుద్ధి చేయటానికి గరుడుని ఆదేశించాడు.గరుడుడు తన తల్లి ఆఙ్ఞతో,విష్ణు మూర్తిని తలచుకుంటూ భోగవతి నదిని తీసుకుని వచ్చాడు.నదీమ తల్లిని రాళ్ళు,రప్పలు దాటించి ఏడుగురు ఋషులను సత్కరిస్తూ భోగవతి నది వన దుర్గమ్మ చెంతకు చేరింది.
ఏడుపాయల తల్లి మహిషాసుర మర్దిని రూపంలో ప్రత్యక్షమవుతుంది.ఏడుగురు ఋషుల వద్ద నుండి ప్రవహించిందని ఏడు పాయలుగా గంగమ్మ విడిపోయింది.అందుకే ఏడుపాయలు అని పేరు.ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.చల్లని చూపుల తల్లి,భక్తులను ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుతుంది.
ఇష్టమైన పూలు: అన్ని రంగుల పూలు సమర్పించిన ఆనందంగా కటాక్షం
ఇష్టమైన రంగుల: ఎరుపు,ఆకుపచ్చ
నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు.
-తోలేటి వెంకట శిరీష