ప్రపంచ వ్యాప్తంగా బుద్ధ దేవాలయాలు ఎన్నో వున్నాయి. ధాయ్ లాండ్ లో ఉన్న దేవాలయ మరీ ప్రత్యేకం. వెయ్యి ఎకరాల స్థలం లో నిర్మించిన ఈ దేవాలయాన్ని వాట్ ప్రాదమకాయ పేరు తో పిలుస్తారు. ధాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్లాంగ్ లువాన్ మండల లో ఉంది. నియమాలతో పని లేకుండా ఒక బిలియన్ డాలర్ల ఖర్చుతో దాన్ని నిర్మించారు చూసేందుకు అంతరిక్ష నౌకలా క్రీడా స్థలం లా ఉంటుంది. దేవాలయం మధ్య భాగంలో ఒక గోపురం వుంటుంది. ఆ గుండ్రని గోపురం బయట బంగారు పూత పూసిన మూడు లక్షల బుద్ధుని కంచు విగ్రహాలు,లోపల ఏడు లక్షల విగ్రహాలు ఉంటాయి. ఇది ధ్యాన మందిరం . ప్రతి రోజు సామూహిక ప్రార్ధనలు ,ధ్యానాలు జరుగుతాయి. లక్ష మంది వరకు భక్తులు వచ్చే దేవాలయంగా ప్రసిద్ధి . ఈ దేవాలయం గురించి 2010 వరకు బయట ప్రపంచానికి తెలిపారు. ఏడాది జరిగిన ఒక ఉత్సవం సందర్బంగా ఇది వెలుగులోకి వచ్చింది.
Categories