Categories
యువతి యువకుల మధ్య ప్రేమ,పరిచయం,పెరిగేందుకు చైనా ప్రభుత్వం అధికారికంగా ప్రేమికుల కోసం ఓ ప్రత్యేకమైన రైలు నడుపుతోంది. చైనా లో ఇరవై ఏళ్ళుగా పెళ్ళిళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయింది. ప్రేమ పెళ్ళి గురించి ఆలోచించకుండా కెరీర్ గురించి ఆలోచిస్తూ వుండటం వల్ల ప్రేమకు పెళ్ళికి యువత దూరం అవుతున్నారని ఈ ఆలోచన చేసింది. ఈ ప్రత్యేక రైలులో ఒక్క విడత వెయ్యి మంది అబ్బాయిలు అమ్మాయిలు రెండు రోజుల పాటు పర్యటనకు తీసుకువెళతారు. ప్రయాణంలో ప్రత్యక కార్యక్రమాలు ద్వారా పరిచయం పెంచుకొని మాట్లడుకునేలా చేస్తారు. ఈ పరిచయంలో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొంటారని రైల్వేశాఖ ఈ ప్రయత్నం చేసింది. వాళ్ళు ఊహించినట్లు గానే ఇప్పుటికే ఎంతోమంది ఈ ట్రైన్ లో ప్రయాణించి,ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకున్నారట.