తొండము నేక దంతమున..తోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలు….చల్లని చూపుల మందహాసున్!!
ఈ రోజు మూడు తొండములతో పూణేలోని సోమ్వార్ పేట్ కి వెళ్ళి దర్శనం చేసుకుని వద్దాం పదండి.అత్యంత శక్తివంతమైన,మహిమలు ఉన్నాయని ఆ స్వామివారిని చూస్తే చాలు. మనకు విఘ్నాలు తొలగించి ఙ్ఞానాన్ని ప్రసాదిస్తూ అవిఘ్నమస్తూ అని ఆశీర్వాదం ఇస్తాడు.
ఇక్కడ దేవాలయం నిర్మాణం సుమారు 16 సంవత్సరాల సమయం.సంస్కృతంలో రెండు శాసనాలు, పర్షియన్ భాషలో ఒక శాసనం వ్రాసి ఉంది.ఇక్కడ అరుదైన చిత్రాలు కూడా వున్నాయి.విదేశీయుడు ఖడ్గమృగాన్ని గొలుసుతో బంధిస్తున్నట్టు,వివిధ దేవతా చిత్రాలు చూడవచ్చు. సంకట చతుర్ధి నాడు స్వామి వారి సన్నిధిలో పూజలు చేసి ముక్తి పొందుతారు.
నిత్య ప్రసాదం: కొబ్బరి,కుడుములు.
-తోలేటి వెంకట శిరీష