మహిళల్లో 40 ఏళ్ళ వయసు దాటక హార్మోనల్ మార్పులు, ఇతర కారణాల వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి . ఆహారపు అలవాట్లు కొన్ని మార్పుకు గలిగితే ఏ వయసులోనైనా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చు . ఆహారాన్ని కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవాలి దీనివల్ల జీవక్రియ పెరుగుతుంది . మూడు సార్లుగా భోజనం రెండుసార్లు అల్పాహారం తీసుకోవాలి . ఆలివ్ నూనె,నట్స్ వాల్ నట్స్ ,అవిసెగింజలు మొదలైనవి ఆహారంలో భాగంగా ఉండేలా చూసుకోవాలి . ఉదయపు అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవాలి . తాజాపండ్లు కూరగాయలు ఆకుకూరలు ఆహారంలో చేర్చుకోవాలి . కేవలం ఆహారపు అలవాట్ల వల్లే నలభైల్లో ఆరోగ్యాని బావుంటుంది .

Leave a comment