ఎండకు నల్లబడ్డ చర్మం తిరిగి మాములు చాయలోకి రావాలంటే ఇంట్లో తయారు చేసుకునే కొన్ని సమ్మర్ ప్యాక్స్ బాగా పని చేస్తాయి. నిమ్మ, కలబంద ప్యాక్ అన్నింటిలోనూ మంచిది. నిమ్మ బ్లీచింగ్ ఏజెంట్, కలబంద చర్మం పై ఉండే బ్యాక్టీరియా ఇతర సూక్ష్మజీవులను చంపే గుణం ఉంటుంది. కలబంద గుజ్జు నిమ్మరసం కలిపి మోహనికి అప్లయ్ చేసి బాగా ఆరిపోయాక కడిగేస్తే చాలు. తెనె,పెరుగులు సహజమైన మాయిశ్చరైజర్లు. ఎండ వల్ల పొడిబారిన చర్మం తేమగా తయారవ్వాలంటే పసుపు, తేనె, పెరుగు కలిపి ప్యాక్ చేస్తే చాలు పది నిమిషాలు ఆరనిచ్చి గోరు వెచ్చని నీటిలో కడిగేస్తే చక్కని ఫలితం కనిపిస్తుంది.

Leave a comment