Categories
చలి రోజుల్లో తేమ ఎక్కువగా ఉంటుంది కనుక శిరోజాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి అంటున్నారు సౌందర్య నిపుణులు షహనాజ్ హుస్సేన్. కొబ్బరి నూనె లేదా బాదం నూనె శిరోజాలకు పట్టించాలి. ఇలా చేస్తే వెంట్రుకలు మృదువుగా పట్టులాగా ఉంటాయి. నూనెతో మాడుని సున్నితంగా మర్దన చేయాలి వెంట్రుకల కుదుళ్ళ నుంచి వలయాకారంలో చేతి వేళ్ళతో మసాజ్ చేయాలి తలస్నానం చేశాక టవల్ తో గట్టిగా వెంట్రుకలను బిగించ కూడదు మాడు పొడిబారిపోయి చుండ్రు సమస్య మొదలవుతుంది కనుక చుండ్రు పోయేందుకు హాట్ ఆయిల్ థెరపీ ట్రై చేయాలి. వారంలో ఒకటి రెండు సార్లు కొబ్బరి నూనెను కాస్త వేడి చేసి శిరోజాలకు మాడుకు రాసుకోవాలి . వేడి నీళ్ళలో పిండిన టవల్ ను తలకు చుట్టుకోవాలి ఐదునిముషాల పాటు ఇలా చేశాక తలస్నానం చేయచ్చు.