చేతుల సంరక్షణ చాలా ముఖ్యం సరిగ్గా పట్టించుకోకపోతే చేతుల పైన ముడతలు వచ్చి ముసలి వాళ్ళ లాగా కనిపిస్తారు. అలా కాకుండా ఉండాలంటే ఇంట్లో ఉండే పదార్థాలతో వాటిని మెరిసిపోయేలా చేయవచ్చు. బాగా పండిన అరటి పండును మెదిపి ఆ గుజ్జు చేతులకు పట్టించుకుని అది బాగా ఆరిపోయాక కడిగేయాలి. ఇది చర్మాన్ని కోమలంగా మారుస్తుంది. నిమ్మరసం పాలు సమాన నిష్పత్తిలో తీసుకొని ఆ మిశ్రమాన్ని చేతులకు అప్లయ్ చేస్తే చేతివేళ్లపై పేరుకొన్న మురికి పోతుంది. శుభ్రంగా కడిగేశాక చేతులకు మాయిశ్చరైజర్ రాసుకుంటే చేతులు కోమలంగా ఉంటాయి.

Leave a comment