సాంప్రదాయ చేనేతకు ఆధునిక హంగులతో చక్కని లుక్ తీసుకు రావచ్చు అంటారు ఎక్సపర్ట్స్ . ప్లెయిన్ లెనిన్ చీరకు 3/4  బెల్ స్లీవ్స్ వీ నెక్ బ్లౌజ్ జోడించచ్చు. కలర్ ఫుల్ పటోరా చీరెకు బెల్ట్ చాలా బాగుంటుంది. పోచంపల్లి డబుల్ ఇక్కత్ డిజైన్ లో పెప్లమ్ టాప్ ఎంచుకొని  జతగా ప్లెయిన్ టాప్ చక్కగా ఉంటుంది. నారాయణ్ పేట్ నేత చీరె లో లాంగ్ గౌన్ లు కుట్టించుకొని వాటికి బెల్-బాటమ్ స్లీవ్స్ యాడ్ చేయచ్చు. ఖాదీ వస్త్రాన్ని బ్లాక్ ప్రింట్ చేయించుకుని జంప్ సూట్ కుట్టించుకోవచ్చు. ఎలా వాడినా చేనేత సోయగం పెరుగుతాయి తప్ప ఎప్పటికీ తగ్గవు.

Leave a comment