జలుబుకీ,ఫ్లూ జ్వరానికి అల్లం మందులా పనిచేస్తుంది. సాంప్రదాయ గృహ చిట్కాలే ఆరోగ్యానికి మేలుచేస్తుంది. అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పుడో ప్రకటించింది. ఈ కరోనా కాలంలో ప్రతి ఇంటా అల్లం వాడకం చక్కగా పెరిగింది కప్పు నీళ్లలో టీ స్పూన్ చొప్పున అల్లం తురుము దాల్చిన చెక్క పొడి వేసి మరిగించి కాస్త తేనె కలుపుకొని తాగితే ఉపశమనం ఉంటుంది. కఫం వుంటే ఈ అల్లం కాషాయం రోజుకి రెండు మూడుకప్పులు తాగమని చెపుతారు.అల్లం వేడికి చెమటలు పట్టటం తో శరీరంలోని టాక్సిన్లు పోతాయి. చెక్కర వ్యాధికి కూడా అల్లం టీ గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా చేస్తుంది. రోజు మొత్తం అల్లం తింటే ఆహారంలోని పోషకాలు బాగా వంట పడతాయి.

Leave a comment