నో షుగర్ ఛాలెంజ్ తీసుకోవటం అంటే ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవటం మొదలు పెట్టడమే అంటారు ఎక్స్ పర్డ్స్ . తేనె, బెల్లం,చక్కర వంటివి పూర్తిగా మానేయటం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్ ఉండే మాట నిజం . శరీరానికి కావలసిన సహజమైన చక్కర పండ్లు ,కూరగాయలు ,తృణధాన్యాల నుంచి కూడా లభ్యం అవుతుంది . వెన్న,నెయ్యి,జున్ను,ముల్లంగి,ఆకుకూరలు ,పుచ్చకాయలు,బెర్రీ ఇలాటివి ఎన్నో పదార్దాలు శరీరానికి శక్తి ఇచ్చేవిగా ఉన్నాయి .  స్ట్రాబెరీలు ,పిచ్ ,నిమ్మ,ఆరెంజ్ ,ద్రాక్ష,అవకాడో,పుచ్చకాయ వంటివి ఆహారంలో ఉండే విటమిన్లు ,ఖనిజాలు ఫైబర్ మొదలైనవి శరీరానికి పూర్తి స్థాయిలో అందుతాయి . రుచికరమైన సలాడ్స్,స్నాక్స్ లు ,చక్కర లేని విందు భోజనాన్ని ప్రతిరోజు తినచ్చు . కాస్త చక్కర తగ్గించినందువల్ల కలిగే లాభాలను దృష్టిలో ఉంచుకొంటే ఏదీ అసాధ్యం కాదు .

Leave a comment