Categories
దక్షిణ సుడాన్ కు చెందిన న్యాకిమ్ గాట్వీన్ ను క్వీన్ ఆఫ్ ది డార్క్ గా పిలుస్తారు . చిన్నతనం నుంచి వర్ణవివక్షను ఎదుర్కొంటు మోడల్ గా ఎదిగింది న్యాకిమ్ 17 వ సంవత్సరం లోనే మోడలింగ్ లో అడుగు పెట్టిన గాట్వీన్వివిధ వేదికల్లో తళుక్కుమని మెరిసింది . నా రంగు గురించి ప్రతికూలంగామాట్లాడే మాటకు నాపైన ఎలాంటి ప్రభావం చూపించావు . కొన్ని నవ్వు తెప్పిస్తాయి ,కొన్ని గాయపరుస్తాయి . కొన్ని మిలియన్ల మంది నా పై ప్రశంసల కురిపిస్తూ ఉంటే ఉద్దేశ పూర్వకంగా చేసే కొన్ని విమర్శలను నేనెందుకు పట్టించుకోవాలి అంటుంది న్యాకిమ్ . న్యాయవాదిగా వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ఎన్నో వేదికల పైన పోరాడుతుంది వ్యాకీమ్ . ఈ నల్లకలువ ను అందరూ సహజ సౌందర్యరాశి అంటూ ప్రశంసిస్తారు .