సీతా ఫలాలతో చక్కని స్కిన్ టోన్ వస్తుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. శరీరం లోని కొలాజెన్ స్థాయిల్ని మెరుగుపరిచే గుణం సీతా ఫలాల్లో ఉంటుంది.చర్మంపై ముడతలను ఫైన్ లెన్స్ ను తగ్గించే శక్తి ఉంటుంది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో గల ఫ్రీరాడికల్స్ తో పోరాడతాయి దీనివల్ల చర్మం టోన్ మెరుగవుతుంది.చర్మకణాల పునరుత్పత్తి పెరుగుతుంది. వార్ధక్య ప్రక్రియను జాప్యం చేసే యవ్వన రూపాన్ని ఇస్తాయి సీతా ఫలాల్లోని సోడియం, పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహకరించి గుండె ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయి. పీచు కూడా ఎక్కువే కనుక కలోన్, లివర్ పనితీరు మెరుగుపడుతుంది.

Leave a comment