Categories
దేశంలోనే రెండో మహిళా వైద్యురాలుగా కాదంబినీ గంగూలి సుప్రసిద్దురాలు. బీహార్ లోని భాగల్పూర్ లో జన్మించిన కాదంబినీ తండ్రి వ్రజ కిషోర్ మహిళ విముక్తి కోసం పోరాటం నిర్వహించారు. భాగల్పూర్ కాదంబినీ గంగూలి మహిళ సమితి పేరుతొ సంస్థ ఏర్పాటు చేశారు. కాదంబినీ గంగూలి కలకత్తా మెడికల్ కాలేజి లో వైద్య విద్య అభ్యసించారు 1886 లో ఆనందీ గోపాల్ జోషి తర్వాత వైద్యురాలైన రెండో మహిళ గా గుర్తింపు పొందారు. ద్వారకా గంగూలీ ని పెళ్ళాడిన తరువాత సామజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. 1889 లో నటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం వహించిన ఐదుగురు మహిళల్లో కాదంబినీ ఒకరు.