నా ఫ్యాషన్ బ్రాండ్ మసాబాను ఇప్పుడు మస్కాబా గా మార్చేశాను. ఉచితంగా పంచటం కోసం నాన్ సర్జికల్ మాస్క్ లు తయారు చేస్తున్నాం. వీటిని ఉతికి వాడు కోవచ్చు దుస్తుల తయారీ కోసం ఉపయోగించే మెటీరియల్ నే ఉపయోగిస్తున్నాం అంటోంది ప్రముఖ నటి నీనా గుప్తా కుమార్తె మసాబా గుప్తా. మాస్క్ లు తయారు చేస్తున్న వర్కర్ల ఫోటొలు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ. ఈ లాక్ డౌన్ లో హౌస్ ఆఫ్ మసాబా లో కార్యకలాపాలు స్తంభించి పోయాయి. నష్టం వస్తున్న మాట నిజం అయినా దేశం గర్వపడే పని చేయాలనుకొన్న. అన్ని శుభ్రతా చర్యలు చేపట్టి ఈ మాస్క్ ల తయారీ మొదలు పెట్టాను. ఇవన్నీ ఉచితంగా ఇచ్చేందుకే అంటోంది మసాబా గుప్తా.