ఇప్పుడు ఫ్యాషన్  డ్రెస్సు లన్నీ సినిమా హీరోయిన్లే వేసుకోవాలని ఆతరువాతే వాటిని చూసి అమ్మాయిలు వేసుకోవాలని రులు పంపలేదు. సీజనల్ డ్రెస్ లు, ఫ్యాషన్ మోడల్స్ కాటన్, సిల్క్ ఫ్యాషన్ డ్రెస్సులు మంచి బ్రాండ్స్ తో ఆన్ లైన్ లో దర్శనం ఇస్తున్నాయి.పేరు ప్రఖ్యాతలున్న  ఫ్యాషన్ గురు తమ సరికొత్త మోడల్స్ ని డిజైన్ చేయగానే ఆన్ లైన్ లో పెట్టేస్తున్నారు. రిసెప్షన్ లకు పండగలకు లెగ్గింగ్స్, జేగ్గింగ్స్ తో పాటు టైట్స్, పలాజోలు ఇప్పుడు లేయర్స్ తరహ డ్రెస్సులు వస్తున్నాయి చూడండి. పొరలు పొరలుగా ఒకటి మించి రెండు మూడు వరుసల్లో డిటాచబుల్, అన్ డిటాచబుల్ రకాలు వస్తున్నాయి. కాటన్ పాళీ జార్జెట్ క్రేప్ వంటి వస్త్ర శ్రేణి తో కుట్టే ఈ లేయర్స్ స్టయిల్ కోసం ఇమేజస్ చూడొచ్చు.

Leave a comment