Categories
రూపాయి తీసుకోకుండా పాలు, పెరుగు ఇస్తారంటే ఎవరైనా నమ్ముతారా ? కర్నూలు జిల్లా గోనేగండ్ల మండలంలో గంజ హళ్ళిలో అన్ని వ్యవసాయ కుటుంబ లే .రైతులు సేద్యాన్ని నమ్ముకొంటారు కానీ పాడిని మాత్రం అమ్ముకోరు .కొన్నేళ్ళ క్రితం బడే సాహెబ్ అనే ఆధ్యాత్మిక వేత్త ఈ ఊర్లో పాలు అమ్మవద్దు, గోవధ చేయవద్దు , పాలు తాగనివ్వకుండా దూడలను కట్టడి చేయవద్దు అని ఆదేశించారు. అప్పటి నుంచి అదే కట్టు బాటు కోనసాగుతుంది .అయన పేరుతో దర్గా వెలసింది .రైతులు భక్తి శ్రద్దలతో బడే సాహెబ్ మాటలు పాటిస్తున్నారట .అందుకే ఇక్కడ పాలు పెరుగు ఉచితం .