Categories
వర్షాకాలంలో జలుబు దగ్గు రాకుండా గొంతు నొప్పి వేధించకుండ ఈ కషాయం తీసుకోండి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.చిన్న అల్లం ముక్క అరస్పూన్, తేనె, నిమ్మకాయ, తులసి ఆకులు, దాల్చిన చెక్క, లవంగాలు, సోంపు తీసుకోవాలి. రెండు గ్లాసుల నీళ్లు మరగనిచ్చి అల్లం ముక్కలుగా తరిగి అందులో వేయాలి తులసి ఆకులు లవంగాలు దాల్చినచెక్క వేసి నీళ్లు సగం అయ్యేవరకు మరిగించాలి దాన్ని గ్లాసులోకి వడబోసి తేనె నిమ్మరసం కలిపి వేడిగా ఉన్నప్పుడే తాగాలి రోజుకు రెండుసార్లు ఈ కషాయం తాగితే దగ్గు గొంతు నొప్పి తగ్గిపోతుంది.ఈ కషాయం లో ఉపయోగించిన పదార్థాలు అన్నీ యాంటీ బాక్టీరియల్ యాంటీ వైరల్ సమ్మేళనాలు కలిగి ఉంటాయి.వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ ఇస్తాయి.