Categories
అన్ని రకాల ముడిధాన్యాలు లాగే మొక్కజొన్న లో కూడా పిండిపదార్థాలు అధికం గానే ఉంటాయి.ఈ కాలంలో అధికంగా దొరికే బేబీకార్న్ శక్తి నిచ్చే ఆహారం అంటారు న్యూట్రిషనిస్ట్ లు .వీటిల్లోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.బేబీ కార్న్ లో థయామిన్, రిబోఫ్లావిన్,ఫోలిక్ యాసిడ్, నియాసిన్ వంటి బి విటమిన్లు ఉంటాయి. వీటిని కూరల్లో,మిగతా కాయగూరల్లో కలిపి వండితే అన్ని పోషకాలు అలాగే ఉంటాయి.పిల్లలకు ఇది మంచి స్నాక్ మొక్కజొన్నల కంటే పిండిపదార్థాలు బేబీకార్న్ లో తక్కువగా ఉండటం వల్ల వీటిని కాయగూరలతో సమంగా వాడు కోవచ్చు పీచు కూడా ఎక్కువే.