పిల్లలు ఇళ్లలోనే ఆన్ లైన్ క్లాసులకు అటెండ్ అవుతున్నారు.స్కూల్లో మాదిరిగా కుర్చీ డెస్క్ వంటి సదుపాయాలు లేక పోతే పిల్లలు ఏ సోఫా లో ఒరిగిపోయి  కూర్చుంటారు.ఇది వీపు కండరాలకు ఒత్తిడి తెస్తుంది.వెన్ను మెడనొప్పి వస్తాయి.ఎదుగుతున్న వయసులో ఇలాంటి సమస్య రాకుండా చూసుకోవాలి టేబుల్ పైన లాప్ టాప్ పెట్టి తిన్నగా కూర్చుని పాఠాలు వినే ఏర్పాటు చేయాలి.కుర్చీ వెనక భాగానికి వీపు ఆనుకొని ఉండాలి.పాదాల కింద సపోర్ట్ గా చిన్న పేట ఉంటాయి.ఆన్ లైన్ తరగతులకు డెస్క్ టాప్ ఉత్తమము.మంచం పైన కూర్చుని పాటలు వినటం ప్రమాదం మంచిది కాదు వెనక వీపుకు సపోర్ట్ లేకుండా అంత సేపు కూర్చుంటే వెన్నెముక వొంగి పోయే ప్రమాదం ఉంది.

Leave a comment