Categories
కొన్ని పండ్లు కూరలు మార్కెట్ నుంచి తేగానే ఫ్రిజ్ లో పెట్టేస్తాం. కానీ అన్నింటిని కలిపి ఉంచితే నష్టమే అంటారు ఎక్స్పర్ట్స్. కీర దోస విడిగానే భద్రపరచాలి. మగ్గిన పండ్లు ఇథలిన్ వాయువు విడుదల చేసి ఇతర పదార్థాలు కుళ్ళి పోయేలా చేస్తాయి. యాపిల్ తో పాటు ఇతర పండ్లు కీర ను త్వరగా పాడయ్యేలా చేస్తాయి. కీర ను ఫ్రిజ్ లో పెట్ట దలుచుకొంటే ఈ పండ్లను దూరంగా పెట్టాలి.అలాగే గుమ్మడి ఆపిల్ ను కూడా కలిపి పెట్టకూడదు.గుమ్మడికాయ ఎంత వేడికి అయినా తట్టుకుంటుంది. దీన్ని గది ఉష్ణోగ్రత లో నిల్వ చేయవచ్చు.యాపిల్ మాత్రం ఫ్రిజ్ లోనే ఉంచాలి.