Categories

కావాలని నవ్వినా ,నవ్వొచ్చి నవ్వినా, ఎలా నవ్వి నా సరే నువ్వు నవ్వే దీనివల్ల మేలే జరిగేది అంటున్నారు పరిశోధకులు.నవ్వుతో ముఖంలో కదిలే కండరాలు వల్ల మెదడులో న్యూరో ట్రాన్స్ మీటర్లు విడుదల అవుతాయని దీనివల్ల మన మనసుకి హాయిగా అనిపిస్తుందని పరిశోధనల్లో తేలింది కోవిడ్ కారణంగా ఎంతోమంది డిప్రెషన్ లోకి వెళ్ళటం ఆందోళన పడటం వల్ల ఆరోగ్యం పాడవడం గురించి చేస్తున్న పరిశోధనల్లో నవ్వుతో మానసిక శారీరక ఆరోగ్యం బాగుంటుందనీ పాజిటివ్ గా ఆలోచించే గుణం పెరుగుతుందని తేలింది. అందుకే మనసులో ఒత్తిడి అనిపిస్తే హాస్య ప్రధానమైన సినిమానో, పుస్తకాన్నో ఎంచుకుని నవ్వుతూ ఉండండి అంటున్నారు పరిశోధకులు.