Categories

ఎ సూటబుల్ బాయ్ వెబ్ సిరీస్ గతవారం నెట్ ఫ్లిక్స్ లో విడుదలై టబూ ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది.నటిగా నాది అద్భుతమైన ప్రయాణం. నా కెరియర్ కు సవాల్ గా భావించిన పాత్రల్లో ఎ సూటబుల్ బాయ్ సైదా బాయ్ పాత్ర ఒకటి. మీరా నాయర్ తో ది నేమ్ సేక్ సినిమాలో కలిసి నటించాను కనుక ఆమె దర్శకత్వం పైన నాకు నమ్మకం ఉంది. అందుకే సైదా బాయ్ గా నటించేందుకు సరే అన్నాను. 1950 ల నాటిది సైదా తెరపైన వేశ్యలాగా కాకుండా కళాభిరుచి గల వ్యక్తిగా కనిపించాలి. ఆమె జీవితం సంగీతం-సాహిత్యం కళల చుట్టూ ఉంటుంది. నటిగా నా పరిమితుల్ని అధిగమించేందుకు నేను అనేక జీనర్ల చిత్రాలు ఎంపిక చేసుకుంటాను అంటోంది టబూ.