Categories
అనికా చేబ్రోలు యువ శాస్త్రవేత్త.కరోనా వైరస్ వృద్ధిని నియంత్రించే ప్రోటీన్ కు అతుక్కునే ఒక పదార్ధాన్ని రూపొందించింది అనికా .ప్రపంచం ఎదుర్కొనే సమస్యల పైన ఆవిష్కరణలు చేస్తున్న వారిని ప్రోత్సహించేందుకు అమెరికా లో నిర్వహించిన 3M యంగ్ సైంటిస్ట్ చాలెంజ్ లో 14 ఏళ్ల అనికా చేబ్రోలు విజేతగా నిలిచింది.కరోనా వైరస్ కు వ్యాక్సిన్ తయారు చేయటం కోసం విజేత గా తయారు చేయడం కోసం ప్రత్యేకంగా సార్స్ కోవ్ -2 వైరస్ ప్రోటీన్ ను రూపొందించింది.నేను కనిపెట్టిన పదార్థం కరోనా వైరస్ లోని ఒక పదార్థాన్ని అతుక్కుంటుంది.తర్వాత ఆ ప్రోటీన్ పనితీరు నియంత్రిస్తుంది అంటోంది అనికా చేబ్రోలు.