షీరోస్ ఫిగర్ గా భారతదేశం నుంచి బార్బీబొమ్మ (Barbie doll) మోడల్ గా ఎంపికైన రెండో మహిళను నేను. నా చామనచాయ రంగు పోనీ టైయిల్ కృత్రిమ కాలు అచ్చుగుద్దినట్టు తయారు చేశారు. ఈ బొమ్మను ఎంతటి ఊహించని పరిమాణం ఎదురైనా ఎదుర్కొనీ జీవితంలో ఎదిగిన వైనాన్ని నా ప్రతిరూపమైన ఈ బార్బీ బొమ్మలు చూసి ఆడపిల్లలు స్ఫూర్తి పొందితే నాకు అంతే చాలు అంటుంది మానసి జోషి.ఎనిమిదేళ్ల క్రితం లారీ డీ కొట్టే ఆ ప్రమాదంలో కాలు పోగొట్టుకుని కృత్రిమ కాలుతో పారాలింపిక్స్ వరల్డ్ ఛాంపియన్ గా ఎదిగిన మానసి జోషి బార్బీ బొమ్మ మార్కెట్లోకి వచ్చింది. వైకల్యంతో కుంగిపోయిన రోజు నుంచి ప్రపంచ చాంపియన్ గా ఎదిగిన ఎనిమిదేళ్ళ ప్రయాణం నా జీవితంలో ఎంతో కీలకం మొదట్లో బాధ పెట్టిన తర్వాత నాకు నష్టం జరిగిందని బాధపడిన సందర్భం లేదు అంటుంది మనిసి జోషి .