Categories
గ్లామర్ పాత్రలు ఎప్పుడైనా ఏ భాషలో అయినా చేయచ్చు విబిన్నమైన పాత్రల తోనే గుర్తింపు వస్తుందని నా గాఢమైన అభిప్రాయం. ఈ మధ్య కాలంలో నేను నటించిన సినిమాల్లో ఎదో ప్రత్యేకత ఉన్న పాత్రల్లోనే నాకు పేరు వచ్చింది. హిందీలో ‘ఏక్ లాడకీకో దేఖతో ఐసాలగా’ లో లెస్టియాన్ పాత్ర నాకు చాలా నచ్చింది. భారతీయ చిత్రాల్లో ఇలాటి సినిమా రావటం బహుశా ఇదే మొదటి సారెమో అంటోంది రెజీనా కాసాండ్రా. ఇలా విభిన్నతకు ప్రాధాన్యత ఇవ్వటం పూర్తిగా నా నిర్ణయమే. నటన నా ఫ్యాషన్. అందుకే నన్ను సవాల్ చేసే పాత్రలు నటించే ఏ కాస్త అవకాశం దొరికిన వదులుకోను అంటుంది రెజీనా.