గత సంవత్సరం లాక్ డౌన్ ప్రకటించాక రెడ్ లైట్ ఏరియా లో ఉన్న వాళ్లకి ఆకలి తీర్చేందుకు వన్ మిలియన్ మిల్స్ కాంపెయిన్ మొదలుపెట్టాము మేం నిర్ణయించుకొన్న లక్ష్యం వంద రోజుల్లో 10 వేల మందికి భోజనాలు. కానీ 100 రోజుల్లో 50 లక్షల దాటిపోయింది, యాభై వేల మందికి పైగా మహిళలు పిల్లలకు అండగా నిలిచింది అంటోంది రుచిర గుప్తా.1 మిలియన్ మిల్స్ క్యాంపెయిన్ ప్రారంభకురాలు ఈమెనే. ఆప్ నే ఆప్ స్వచ్ఛంద సంస్థ నడిపేది కూడా ఈ రుచిరా గుప్తా నే. గతంలో ఈమె జర్నలిస్ట్ గా పనిచేసారు 1996 లో ది స్పెల్లింగ్ ఆఫ్ ఇన్నోవెంట్స్ అనే డాక్యుమెంటరీ తీశారు. భారత్ లోని రెడ్ లైట్ ఏరియా లోని మహిళలు దుర్భర జీవిత చిత్రం ఇది ఇందుకుగానూ రుచిర గుప్తా కు ఎమ్మీ అవార్డ్ వచ్చింది.