గాజు బీకర్లు,సీసాలు,అందమైన గాజు పాత్రల్లో వాటర్ బీడ్స్ తో మొక్కల్ని పెంచుతున్నారు తెలుసా. గోధుమ గడ్డి, బీట్ రూట్, బ్రకోలీ, మెంతి, క్యాబేజీ వంటి మైక్రో గ్రీన్స్ ని పెంచేందుకు నీటి పూసలు వచ్చాయి .సూపర్ అబ్ సార్ట్ంట్ పాలిమర్ లేదా సోడియం పాలి అక్రి లేట్ అనే పదార్ధం తో తయారు చేసిన బుల్లి బాల్స్ నీళ్ళలో వేస్తే స్పాంజి మాదిరి నీళ్లను పీల్చుకుని ఉబ్బుతాయి. వీటిని మొక్కలు పెంచలనుకునే గాజు పాత్రలో వేసి మొక్క పెరుగుదలకు అవసరమైన ఖనిజాలను ద్రవరూపంలో పోస్తే వాటిని మొక్క పీల్చుకో కలుగుతుంది. నీటిని కూడా ఈ పూసలు నుంచే కొద్దికొద్దిగా తీసుకుంటుంది. అప్పుడప్పుడు ఈ పూసల లో నీళ్ళు పోస్తూ ఉండాలి .ఖనిజాల ద్రవాన్ని వారం పది రోజులకు ఒకసారి పోస్తే చాలు ఈ పూసల్ని మట్టిలో పెంచే మొక్కలకు కూడా వేయొచ్చు ఒకటి రెండు రోజులు ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తే మొక్కలు ఎండిపోకుండా ఈ వాటర్ బీడ్స్ కాపాడతాయి. లక్కీ బ్యాంబూ మొక్కలకు,ఈ నీటి పూసలతో పాటు కొన్ని గులక రాళ్లు వేస్తే మొక్క నిలువుగా పడిపోకుండా ఉంటుంది. చిట్టి మొక్కలు ఈ రంగు రంగుల నీటి పూసల మధ్యలో చాలా అందంగా ఉంటాయి.
Categories